JEE BRAC: జేఈఈ మెయిన్ బీఆర్క్ ఫలితాలు విడుదల...! 1 y ago
జేఈఈ (మెయిన్) పేపర్-2 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్ష జనవరి 30వ తేదీన బీఆర్క్/ బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రిలిమినరీ కీ ని ఫిబ్రవరి 15న విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు తుది కీ 22వ తేదీన విడుదల చేసి ఫలితాలను అందుబాటులో ఉంచారు. అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి అభ్యర్ధులు తమ స్కోరు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అలాగే జేఈఈ మెయిన్ సెషన్ 2కు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్ధులు తొలి సెషన్లో సాధించిన పర్సంటైల్‌తో సంతృప్తి చెందని వారు మరింత మెరుగైన స్కోరు కోసం ఫిబ్రవరి 25లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షను ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీలోపు నిర్వహించనున్నారు.